ప్రజల కోసం… వారి జీవితాల్లో మార్పు కోసం… యాత్ర గా వస్తున్నా
భారత్ జోడో యాత్రకి కొనసాగింపుగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర పాదయాత్ర కోసం ఇంటి నుంచి బయలుదేరుతున్న రేవంత్ రెడ్డికి కూతురు నైమిష హారతి ఇచ్చారు. తన కూతురు హారతి ఇచ్చిన వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేస్తూ రేవంత్ ఎమోషనల్ అయ్యారు. నా ప్రజాప్రస్థానంలో యాత్ర కీలక ఘట్టం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టాను. ప్రజల ఆశీర్వాదంతో నాయకుడుగా ఎదిగాను. ప్రశ్నించే గొంతుకగా వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను. నన్ను నాయకుడ్ని చేసిన ప్రజల కోసం… వారి జీవితాల్లో ‘మార్పు కోసం… యాత్ర గా వస్తున్నా’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.













