ఎంతో మందికి ఆయన ఆదర్శం : సీఎం రేవంత్
భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ సమాధి వద్ద గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ పరిపాలనలో మార్పులు తెచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. దేశాన్నీ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని తెలిపారు. ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జాతి గర్వించదగ్గ మహానీయుడు పీవీ అని కొనియాడారు. పీవీ కీర్తిని పెంచేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.













