మీ అందరికీ ఇదే ఆహ్వానం : రేవంత్ రెడ్డి
ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ ప్రజలను సీఎల్పీనేత రేవంత్ రెడ్డి ఆహ్వనించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం 1:04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఆహ్వానిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు, బలహీనవర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ , రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో డిసెంబరు 7న ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికి ఆదే ఆహ్వానం అని పేర్కొన్నారు.













