సీఎం రేవంత్ రెడ్డి కలిసిన హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు.
సీఎం సమక్షంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కోసం హరే కృష్ణ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్న జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు సహకారం అందిస్తున్న సంస్థలు.
నాగర్‌కర్నూల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం రూ. 5.17 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించిన జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ శేఖర్ రెడ్డి, సీఈవో అనిల్ బాబు.
వికారాబాద్‌లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ. 4 కోట్ల చెక్కును హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించిన చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి సమంత డే, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్.
నిధులు అందించిన సంస్థల ప్రతినిధులను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, హరే కృష్ణ ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీ.
సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలి.
విద్యార్థుల శారీరక పెరుగుదల, విద్యా పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలి.
ఆహారంలో ఇచ్చే పదార్థాల క్యాలరీలను లెక్కించడానికి యాప్‌లను ఉపయోగించుకోవాలి.
బ్రేక్‌ఫాస్ట్ వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుంటారు.
ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ప్రాంతాల వారీగా అక్కడి అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయాలి.
సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తాం.
జీవితకాలం కొనసాగే కార్యక్రమం ఇది. కాబట్టి అత్యంత జాగ్రత్త వహించాలి.
నవంబర్ 30లోగా సెంట్రల్ కిచెన్లు పూర్తి అయ్యేలా చూడాలి.
డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సెంట్రల్ కిచెన్ల ప్రారంభం.
సెంట్రల్ కిచెన్లను విద్యార్థులు సందర్శించేలా చర్యలు తీసుకోవాలి.








