తెలగాణలో ఘనంగా రంజాన్ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. చార్మినార్, మక్కా మసీదు, మీరాలం ఈద్గాతో పాటు రాష్ట్రంలోని అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. సామూహిక ప్రార్థనలతో మసీదులు, ఈద్గాల్లో ఆధ్మాత్మిక వాతావరణ వెల్లివిరిసింది. ముస్లిం సోదరులు ఒకరకొకరు రంజాన్ శుభాంక్షలు చెప్పుకున్నారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు కొనసాగించిన ముస్లిములు సోమవారం సాయంత్రం విరమించారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాల నుంచి ముస్లింలు ఇంటి వద్దనే రంజాన్ వేడుకలు జరుపుకొన్నారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఘనంగా ప్రార్థనలు నిర్వహించారు.













