టీఆర్ ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ
ఏడాది క్రితం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ, సీనియర్ నేత జానారెడ్డి, రమేష్‌కు కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ఖానాపూర్ టికెట్ ఇవ్వడంపై రమేష్ రాథోడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రమేష్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆయనకు కాంగ్రెస్ పెద్దలు టికెట్ హామీ ఇచ్చారా? లేదా అనే విషయం తెలియరాలేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఖానాపూర్ నుంచి రమేష్ పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.













