కొండగట్టుకు రాహుల్ గాంధీ
అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్న కాంగ్రెస్ ప్రచారానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18వ తేదీన జగిత్యాల జిల్లాలో ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు పర్యటించనున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజల అనంతరం ప్రచార రథాలను ప్రారంభించనున్నారు. కొండగట్టు నుంచి ప్రచార రథం (బస్సు) ద్వారా మల్యాల మీదుగా జగిత్యాలకు రాహుల్ చేరుకొనున్నారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సాయంత్రం రాహుల్ రోడ్ సో నిర్వహించనున్నారు.













