5 దేశాల్లో పీవీ నరసింహారావు విగ్రహాలు : మహేశ్ బిగాల
ప్రపంచవ్యాప్తంగా 5 దేశాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాలను స్థాపించాలని తెలుగు సంస్థల ప్రతినిధులు నిర్ణయించారు. ఈ మేరకు అట్లాంటాలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహేశ్ బిగాల హాజరయ్యారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు పీవీ శత జయంత్యుత్సవాలు జరుపుకున్నామని అన్నారు. అమెరికాలోని అట్లాంటాలో పీవీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అట్లాంటాలో స్థల పరిశీలన జరిగిందని అన్నారు. విగ్రహ ప్రతిష్టాపన గురించి కేశవరావుతో చర్చించి నవంబర్లో ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. విగ్రహావిష్కరణకు పీవీ కుటుంబ సభ్యులను అమెరికాలోని తెలుగు, ఇతరత్రా ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.













