అదానీ కోసమే … విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుక కుట్ర: మంత్రి పువ్వాడ
విశాఖ స్టీల్‌ప్లాంట్ వెనుక కుట్ర జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ శాసన సభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పువ్వాడ మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా గనులకు కేంద్ర ప్రభుత్వం అదానీ పరం చేస్తోందని ఆయన ఆరోపించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్ గనులు లేకుండా దాన్ని మూసివేసేందుకు యత్నిస్తున్నారు. బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్‌ను ముద్రాకు తరలిచేందుకు కుట్ర చేస్తున్నారు. ఆ గనులకు బయ్యారానికి కేటాయించకుండా గుజరాత్‌కు తరలిస్తున్నారు. అదానీ కోసమే బైలదిల్లా నుంచి 1800 కి.మీ. దూరంలోని ముంద్రాకు తరలిస్తున్నారు. బయ్యారంలో ఎప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరగకుండా కుట్ర జరుగుతోంది. అక్కడ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం ముందుకొస్తే మౌలిక వసతుల్లో 50 శాతం ఖర్చు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలిపారు.













