27న ప్రవాసీ ప్రజావాణి ప్రారంభం

ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమంలో ఈ నెల 27న ప్రజాభవన్‌లో నూతనంగా ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక కౌంటర్‌లో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి ఉంటుందన్నారు.