రాష్ట్రంలో ఆ పార్టీ కి ఓటు అడిగే హక్కు లేదు : మంత్రి పొన్నం

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చిందా అని నిలదీశారు. బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. చేనేతలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ అమరవీరులను అవమానించిందని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.