కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక … దేశవ్యాప్తంగా : మంత్రి పొన్నం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మహాత్మా జ్యోతిబాపులే గుర్తుకు రాలేదా? అంటూ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్లో పార్టీ పదవులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన తర్వాతే సామాజిక న్యాయం గురించిం మాట్లాడాలని హితవు పలికారు. పులే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంపై మాట్లాడేటప్పుడు అక్కడి పరిధులు తెలుసుకుని మాట్లాడాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని తెలిపారు.













