కేంద్రం ఎంత ఇస్తే… అంతే ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా : మంత్రి పొన్నం

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరువు, రాజకీయ పార్టీ, ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సాయం కోరాలన్నారు. కల్లాల్లోకి వడ్లు రాకముందే బండి సంజయ్ విమర్శలు చేస్తున్నారు. వడ్లు కొననిరోజు, తూకంలో మోసాలు జరిగినప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. సంజయ్‌కు చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి కరువు నిధులు తేవాలన్నారు. కేంద్ర ఎంత ఇస్తే, అంతే మొత్తంలో ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు.