దమ్ముంటే నన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయండి
దమ్ముంటే తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు జనాన్ని ఎలా తరలించారో అందరికీ తెలుసన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటానని తెలిపారు. తన కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు.













