పోలండ్ పెట్టుబడులకు ఇతర రాష్ట్రాలు, దేశాల కంటే అత్యుత్తమమైన రాయితీలు
తెలంగాణ రాష్ట్రంలో పోలండ్ పారిశ్రామిక వేత్తల పెట్టుబడులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని అందిస్తామని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. భారత్‌లో పోలండ్ రాయబారి ఆడమ్ బురకోవ్స్కీ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు, దేశాల కంటే అత్యుత్తమమైన రాయితీలు కల్పిస్తామని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే వారికి పక్షం రోజుల్లో అనుమతిస్తామని అన్నారు. సత్వర భూకేటాయింపులు, ప్రపంచస్థాయి హౌలిక వసతులను సమకూరుస్తామన్నారు. వాహనాల తయారీ, వైమానిక ఉత్పత్తులు, ఐటీ, ఆహారశుద్ధి రంగంలో పేరొందిన పోలండ్ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రధాన దేశాల సంస్థలు తమ పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించాయి అవి విజయవంతంగా నడుస్తున్నాయి అని తెలిపారు.













