భద్రకాళి ఆలయంలో ప్రధాని మోదీ పూజలు
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు మోదీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ముందుగా ఆలయ ఆవరణలో గల గోశాల నుందు గోసేలో పాల్గొని గోవులకు గ్రాసాన్ని తినిపించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత భద్రకాళి ఆలయం చుట్టూ ప్రధాని ప్రదక్షిణ చేశారు. అంతకుముందు వరంగల్ లోని మామూనురు ఎయిర్ ఫోర్ట్‌కు చేరుకు ప్రధాని మోదీకి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. నిర్ణీత సంఖ్యలోనే నేతలను అనుమతించారు.













