ఆడ పిల్లల జోలికి వెళ్తే తోలు తీయాలి : పవన్
ఆడ పిల్లల జోలికి వెళ్తే తోలు తీయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న దివ్యాంగుల క్రికెట్ టోర్నికి పవన్ హాజరై టోర్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కథువా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవ్ టీజింగ్, అత్యాచారానికి పాల్పడ్డ వారికి కఠిన శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు. సింగపూర్ తరహాలో శిక్షలు అమలు చేయాలన్నారు. కథువా అత్యాచార ఘటన హృదయాలను కదిలించిందన్నారు. దివ్యాంగ క్రీడాకారులనుద్దేశించి మాట్లాడుతూ మీకు అండగా నిలబడకుంటే ఇంకా ఎవరికి అండగా ఉంటామన్నారు. మిమ్మల్ని ప్రేమిస్తేనే దేశాన్ని ప్రేమించినట్లు అని పేర్కొన్నారు. రూ.కోటి కార్పస్ ఫండ్ కోసం సన్నిహితులను అడుగుతానన్నారు.













