ఖమ్మం జిల్లా అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన పవన్ కల్యాణ్
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సమయంలో బాణసంచా కాల్చారు. ఈ కారణంగా ఖమ్మం జిల్లా చీమలపాడులో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు కూడా. దీనికితోడు ఇంకొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాాజాగా స్పందించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారు, గాయపడిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఫోన్లో వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. జనసేన పార్టీ వారందరికీ అండగా ఉంటుందని ఆ కుటుంబాలకు హామీ ఇచ్చారు. అన్ని రకాల బెనిఫిట్స్ వారికి అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే తనకు కాల్ చేయాలని, తాను వెంటనే స్పందిస్తానని మాటిచ్చారు.













