America: అమెరికాలో నల్లగొండ విద్యార్థి మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా (America) వెళ్లిన ఓ యువకుడిని విధి వంచించింది చదువు పూర్తి కావడానికి మరో రెండు నెలలు మాత్రమే మిగిలి ఉండగా మృత్యువు కబళించింది. అమెరికాలో ఎంఎస్ (MS) చదువుతున్న నల్లగొండ జిల్లా (Nalgonda district)కు చెందిన కోమటిరెడ్డి పవన్ రెడ్డి (Pavan Reddy) మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామానికి చెందిన కోమటిరెడ్డి పవన్ రెడ్డి ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. మరో రెండు నెలల్లో కోర్సు పూర్తికానుండగా, ఇటీవలే ఓ ఉద్యోగానికి ఎంపికయ్యా డు. త్వరలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. అయితే 18వ తేదీన మిత్రులతో సరదాగా గడిపిన పవన్ రెడ్డి , మరుసటి రోజు తెల్లవారుజామున మృతిచెందినట్లు స్నేహితులు గుర్తించారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.






