తెలంగాణలో పూర్తిస్థాయిలో… పాస్ పోర్టు సేవలు

తెలంగాణ రాష్ట్రంలో లాక్‍డౌన్ ఎత్తివేయడంతో పాస్ పోర్టు సేవా కేంద్రాలు, పాస్‍పోర్టు సేవా లఘు కేంద్రాల్లో పూర్తిస్థాయిల్లో సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‍పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, మహబూబ్‍నగర్, సిద్దిపేట, మేడ్చల్, భువనగిరి, వికారాబాద్, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డిలోని సేవా కేంద్రాల్లో ఈ నెల 10 నుంచి సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు.