తెలంగాణ ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన పార్థసారథి
రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ నిష్పాక్షికంగా విధులు నిర్వర్తిస్తాననీ, తెలంగాణ ఎన్నికల సంఘం గౌరవాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తాననీ ఎస్ఈసీ సి.పార్థసారథి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరుగా నియమితులైన ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయనీ, మిగిలిన నగరపాలక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాననీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది పిబ్రవరి 10వ తేదీతో జీహెచ్ఎంసీ పాలకవర్గ పదవీకాలం ముగియనున్న దృష్ట్యా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహంచి కార్యాచరణ రూపొందిస్తామన్నారు.













