రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా పార్థసారథి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి నియమితులు కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలకు గరవ్నర్ తమిళిసై ఆమోదించారు. పదవిలో పార్థసారథి ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. కమిషనర్‌గా ఉన్న నాగిరెడ్డి ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి గల ఈ పదవిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న లేదా విరమణ పొందిన అధికారులను కమిషనర్‌గా నియమించాల్సి ఉంటుంది. పార్థసారథి 1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. ప్రభుత్వలో ముఖ్య కార్యదర్శి స్థాయిలో పని చేసి రిటైరయ్యారు. అగ్రికల్చర్ ఎమ్మెస్సీ చేసిన పార్థసారథి.. ఆదిలాబాద్ డీఆర్డీఏ పీడీగా కెరీర్‌ను ప్రారంభించారు.













