పల్లా కు షాక్ ఇచ్చిన రాజయ్య!
బీఆర్ఎస్కు చెందిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యను కలిసేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హనుమకొండలోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ రాజయ్య లేకపోవడంతో పల్లా వెనుదిరిగారు. రాజేశ్వర్రెడ్డిని కలిసేందుకు ఎమ్మెల్యే నిరాకరించినట్లు సమాచారం. అనంతరం స్థానిక కార్యకర్తలు, రాజయ్య అనుచరులతో పల్లా భేటీ అయ్యారు. రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని, రెండు మూడు రోజుల్లోనే కేసీఆర్ను కలుస్తామని తెలిపారు. రాజయ్య, కడియం శ్రీహరి కలిసి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తారన్నారు.













