వన్ నేషన్- వన్ రేషన్ ప్రారంభం
వన్ నేషన్- వన్ రేషన్ కార్డు విధానం ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి కొత్త విధానాన్ని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాస్వాన్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా అధికారులు, డీలర్లు, కార్డుదారులతో మాట్లాడారు. హైదరాబాద్లో జరిగిన ప్రారంభోత్సవంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆకున్ సబర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకున్ సబర్వాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా వన్ నేషన్- వన్ రేషన్ విధానం అమలు చేస్తున్నాం. నేషనల్ పొర్టేబులిటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ ద్వారా సేవలు అందుతాయి. ఇరు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. హైదరాబాద్లో ఉంటున్న ఇతర ప్రాంత వాసులకు, ఆంధ్రప్రదేశ్ వారికి ఎక్కువ లబ్ధి చేకూరుతుందని తెలిపారు.













