హైదరాబాద్ లో ఓమ్నికాం కేపబిలిటీ సెంటర్
మీడియా రంగంలో అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రఖ్యాత ఓమ్నికాం గ్రూప్ హైదరాబాద్లో తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్) ఏర్పాటుకు ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ న్యూయార్క్లో సంస్థ సీనియర్ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. దీనిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఓమ్నికాంతో మేం మే నెలలో ప్రాథమిక చర్చలు జరిపాం. అవి ఫలించి హైదరాబాద్లో వారు సెంటర్ ఏర్పాటు చేస్తుండటంతో 2,500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి అని తెలిపారు. అనంతరం సంస్థ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జైద్ అల్ రషీద్ మాట్లాడుతూ భారతదేశంతో పాటు అంతర్జాతీయంగా అనేక ఇతర నగరాలను పరిశీలించాక, హైదరాబాద్లో మా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. మా సంస్థ కార్యకలాపాలు 100 దేశాల్లో కొనసాగుతున్నాయి. భారత్లో మరింత విస్తరించేందుకు ఈ కేంద్రం దోహదపడుతుంది అని తెలిపారు.













