Telangana Government: అటువంటి విధానం అమల్లోకి వస్తే… ముందుగానే

ట్రాఫిక్ పెండిరగ్ చలానాల పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరోసారి రాయితీ ఇచ్చిందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా(Social media ) లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించారు. చలానాలపై రాయితీ వార్తలను ట్రాఫిక్ పోలీసులు (Traffic police) ఖండిరచారు. పెండిరగ్ ట్రాఫిక్ చలానాలపై ఎలాంటి రాయితీ లేదని వెల్లడిరచారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దని ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ (CP Vishwaprasad) విజ్ఞప్తి చేశారు. అటువంటి విధానం అమల్లోకి వస్తే ముందుగానే ప్రకటిస్తామన్నారు. తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. echallan.tspolice.gov.in వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని మాత్రమే నమ్మాలని వాహనదారులకు సూచించారు. ఎవరికైనా అనుమానాలుంటే హెల్ప్‌లైన్ నెంబర్లు 040 27852772, 27852721 కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని విశ్వప్రసాద్ తెలిపారు.