ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్సెల్ సివిల్ సర్వీసెస్ అకాడమీ

సివిల్ సర్వీసెస్ ఔత్సాహికులకు ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యా విభాగం ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఎక్సెల్ సివిల్ సర్వీసెస్ అకాడమీని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గండిపేటలో ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్‌తో ఇంటర్, డిడ్రీ కోర్సులు నిర్వహిస్తున్నామని, వీటికి కొనసాగింపుగా ఎక్సెల్ అకాడమీని ప్రారంభించినట్లు తెలిపారు. డిసెంబర్ నుంచి తొలి బ్యాచ్ ప్రారంభమవుతుందన్నారు.











































































