మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎంపికపై పరిశీలకులను నియమించిన టీఆర్ఎస్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. దీంతో అధికార టీఆర్‌ఎస్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మున్సిపోల్స్ జరిగిన జిల్లాలకు పార్టీ అధిష్ఠానం పరిశీలకులను నియమించింది. సీఎం కేసీఆర్ అధికారికంగా ఈ పేర్లను ప్రకటించారు.
వరంగల్ కార్పొరేషన్ : మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్
ఖమ్మం కార్పొరేషన్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్ రెడ్డి
కొత్తూరు మున్సిపాలిటీ : మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
నకిరేకల్ మున్సిపాలిటీ : పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు
సిద్దిపేట మున్సిపాలిటీ : రవీందర్ సింగ్, వంటేరు ప్రతాప రెడ్డి
జడ్చర్ల మున్సిపాలిటీ : మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
ఈ పరిశీలకులందరూ గురువారం సాయంత్రమే తమకు కేటాయించిన ప్రదేశాల్లోకి చేరుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. అధిష్ఠానం ఇచ్చిన సీల్డు కవర్లలోని పేర్లతో ఎన్నికల పరిశీలకులు ఎన్నికల ప్రక్రియను శుక్రవారం ఉదయం నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.