ఆయన మనువరాలుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నారా బ్రహ్మణి ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో వసుంధర, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ రోగులకు బ్రహ్మణి, వసుంధర పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బ్రహ్మణి మాట్లాడుతూ బసవతారకం పేరుతో క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించి ఇంత మంది రోగులకు సేవలు అందిచడం తమ కుటుంబం చేసుకున్న అదృష్టమన్నారు. ఎన్టీఆర్కు మనువరాలుగా పుట్టడం తన పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు. ఎంతో మంది చిన్నారులు బ్లడ్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, రోగులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ కృషి చేస్తుందని తెలిపారు.













