ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు.. హైకోర్టు షాక్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు భుజంగరావు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఇటీవల ఆయన పిటిషన్ వేశారు. ఈ క్రమంలో పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం గురువారం సాయంత్రం 4 గంటల లోపు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గతంలో అనారోగ్య కారణాలతో భుజంగరావు మధ్యంతర బెయిల్ పొందారు. గురువారం దీని గడువు ముగియనుంది.