ఘనంగా మూవర్స్ డాట్ కామ్ వార్షికోత్సవ వేడుకలు
అమెరికాతోపాటు భారతదేశం కేంద్రంగా మూవర్స్ అండ్ ప్యాకేజింగ్ సేవలు అందిస్తున్న మూవర్స్ డాట్ కామ్ (movers.com) 20వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో హైదరాబాద్‌లో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, నాదెళ్ళ గంగాధర్, ప్రసాద్ గారపాటి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈసందర్భంగా మూవర్స్ డాట్ కామ్ సీఈఓ విద్యాధర్ గారపాటి మాట్లాడుతూ, తమ కంపెనీ మాములుగా ప్రారంభమై ఇప్పుడు 75 సిబ్బంది ఉన్న కంపెనీగా ఎదిగిందన్నారు. అమెరికాతోపాటు భారతదేశంలో కూడా తమ కంపెనీ కస్టమర్లకు సేవలందిస్తోందని తెలిపారు. భారతీయ కార్యకలాపాలలో మరో 50 మంది సిబ్బందిని జోడిరచి, దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మూవర్స్ డాట్ కామ్ గత 20 సంవత్సరాలలో 3.5 మిలియన్ల వినియోగదారులకు సేవలందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ 20-మిలియన్ డాలర్ల టర్నోవర్‌కి చేరుకుంది. ఇప్పుడు దీని లక్ష్యం 252 మిలియన్ల డాలర్లుగా ఉంది. ప్రతి నెలా 7000 మంది కస్టమర్లకు సేవలందిస్తున్నామని సీఈఓ విద్యాధర్ గారపాటి తెలిపారు. కొన్నేళ్లలో తమ దృష్టిని లీడ్ అగ్రిగేటర్ నుంచి రీలొకేషన్ మేనేజ్మెంట్ కంపెనీకి మార్చడంపై దృష్టి పెడుతుందని, ప్రతి సంవత్సరం అమెరికాలో దాదాపు 32 నుంచి 35 మిలియన్ల కదలికలు ఉంటాయని.. ఏదో కారణ రీత్యా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుతూ ఉంటారు. గత 20 ఏళ్లలో కేవలం 3.5 మిలియన్ల కస్టమర్లను మాత్రమే పొందాము, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
అమెరికాలో సగటు వ్యక్తి తన జీవితకాలంలో దాదాపు 11.7 సార్లు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మారుతూ ఉంటారు. అందుకోసం 3వేల డాలర్లకు పైగా ఖర్చు చేస్తారు. మేము నెలకు 15000 లీడ్లను పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతి సంవత్సరం7000 మంది కస్టమర్లను పొందాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్కరు 3000 డాలర్లు చెల్లిస్తే, మేము రాబోయే నాలుగేళ్లలో 252 డాలర్ల మిలియన్ల టర్నోవర్‌ను సాధించగలుగుతామని విద్యాధర్ గారపాటి వెల్లడించారు. బీమా, గృహ గృహభద్రత మొదలైన సేవలలోకి ప్రవేశించనున్నట్లు ఆయన తెలిపారు. తమ సంస్థ ‘ప్రతి రోజు కొత్త రోజు, మొదటి నుంచి ప్రారంభించండి’, అనే నినాదంతో ముందుకెళుతుందని, ప్రతి ఒక్క కస్టమర్‌ను కొత్త కస్టమర్‌గా పరిగణిస్తామని, రాబోయే నాలుగేళ్లలో ఐపీవో లక్ష్యంగా పెట్టుకుంటామని విద్యాధర్ గారపాటి ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు మూవర్స్ డాట్ కమ్‌కు వార్షికోత్సవ అభినందనలు తెలిపారు.













