ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు…కాంగ్రెస్ అంటేనే
కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చకపోతే కచ్చితంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉంది. సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదు. డీఎంకే నేతలు దేశాన్ని విచ్చినం చేసేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎందుకు అదుపు చేయడం లేదు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరి ఏంటో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ తన మౌనం వీడి, తన వైఖరిని వెల్లడిరచాలి. తెలంగాణలో హామీల అమలుకు మరికొంత సమయం ఇస్తాం. తగిన సమయంలోగా హామీలు, గ్యారంటీలు అమలు చేయకపోతే కచ్చితంగా పోరాటం చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.













