హైకమాండ్ ఆదేశిస్తే సీఎం అవుతా
ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ అభ్యర్థిని సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తే ఒక ఎస్సీ, ఎస్టీ, ఒక మహిళ, ఓసీ అభ్యర్థి సీఎంను చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే ఆ పదవి చేపడతానని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 సీట్లు గెలుస్తామని, 50 వేల ఓట్ల మెజార్టీతో తాను విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తన బలం, బలహీనత దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలని, రూ.200 కోట్లు ఖర్చు చేసిన తనను ఓడిరచలేకపోతున్నారని పేర్కొన్నారు. తనను ఓడిరచేందుకు ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఓట్ల కోసం రెండు, మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా వెనుకంజ వేయడం లేదని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, తన స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదని ఉద్ఘాటించారు.













