రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా : జీవన్ రెడ్డి
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ నిర్వహించారని టీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా దర్బార్ కాదు, బీజేపీ దర్బార్ అని విమర్శించారు. ఈడీ, సీబీఐ, ఐటీలతో ప్రశ్నించే పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ మూడే కాదు నాలుగో వ్యవస్థగా గవర్నర్ వ్యవస్థను ప్రధాని మోదీ వాడుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయాలపై సోకు ఉంటే బండి సంజయ్‌ను తొలగించిన తమిళ్ సైని నియమిస్త తమకు అభ్యంతరం లేదన్నారరు. ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసైగల్లో 15 రాష్ట్రాలు పని చేస్తున్నాయని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజా దర్బార్ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.
గవర్నర్‌గా ఉండి మా గెలపు ఖాయం మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు అంటున్నారు. గవర్నర్ రాజకీయ పార్టీ నేతనా అంటూ నిలదీశారు. యూపీ, మధ్యప్రదేశ్‌లో రేప్‌లు జరిగాయి అక్కడ మహిళా దర్బార్లు అవసరం అన్నారు. గతంలో ఎన్టీఆర్‌ను గద్దె దింపితే ప్రజలు బుద్ధి చెప్పి మళ్ళీ ఆయన్నే ఎన్నుకున్నారన్నారు. రాజ్ భవన్‌ను రాజకీయ భవన్‌గా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.













