సీఎం కేసీఆర్తో ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. దీంతో మరోసారి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలో సీఎం చాంబర్లో సీఎం కేసీఆర్తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు జగ్గారెడ్డి అపాయింట్మెంట్ కోరవడంతో, సీఎం ఛాంబర్లోకి వెళ్లిన తరువాత జగ్గారెడ్డిని పిలిచారు. దీంతో మరోసారి రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. అయితే ముఖ్యమంత్రి కలవడంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని అభివృద్ధి, పనులపై విజ్ఞప్తి చేసేందుకు ముఖ్యమంత్రినికి కలిశానని జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డి వరకు మైట్రో రైలు వేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. దీంతో పాటు 500 మందికి దళిత బంధు ఇవ్వాలని, మహబూబ్ సాగర్ అభివృద్ధికి, సంగారెడ్డి చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.













