ఎయిరో స్పేస్ తయారీ హబ్‌గా హైదరాబాద్ : మంత్రి వేముల
ఎయిరో స్పేస్ తయారీ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతున్నందని తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బేగంపేటలో వింగ్స్ ఇండియా ఏవియేషన్ సదస్సును కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏవియేషన్ షోకు ఆతిథ్యం ఇవ్వడం హైదరాబాద్‌కు గర్వకారణమని అన్నారు. ఏవియేషన్, ఏరోస్పేస్ సెక్టార్లు రాష్ట్రానికి ప్రాధాన్య రంగాలని తెలిపారు. ఫ్లయింగ్ ఫర్ ఆల్ విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు. పాత విమానాశ్రయాలు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వాటర్ ఎయిరో డ్రోమ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. అన్ని జిల్లాల్లో హెలిప్యాడ్ల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. డ్రోన్ పాలసీతో తెలంగాణ ప్రభుత్వం తమ విజన్‌ను చాటి చెప్పిందన్నారు.













