Minister Uttam: ఆ ప్రచారంలో వాస్తవం లేదు : మంత్రి ఉత్తమ్
అమెరికా, ఇరాన్‌కు యుద్ధ నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్టు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Ramakrishna Rao), పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra) తో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వారు మాట్లాడారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న నేపథ్యంలో కొరతపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులకు సూచించారు. రో జువారీగా 72శాతం బుకింగ్ లు జరుగుతున్నాయని, గృహ వినియోగదారులతో పాటు ఆస్పత్రులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్య క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ యాసంగి ధాన్యం సేకరణకు గన్నీ బ్యాగులు, నిల్వలకు గోదాంలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ అనురాగ్‌జయంతి, అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, డీఏవో పీవీ.రమణారెడ్డి, డీసీఎ్‌సవో రోజారాణి, మార్కెటింగ్ డీఎం సబిత, ఉద్యానశాఖ అధికారి మాధవి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి








