వాటిపై త్వరలో ఒక నిర్ణయం… అవసరమైతే : మంత్రి తలసాని
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో వారం పాటు అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ హుస్సేన్ సాగర్ నుంచి 2 వేల క్యూసెక్యుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నాలాల వద్ద అక్రమ నిర్మాణాలతో ఇబ్బందులున్నాయని, వాటిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడిరచారు. అవసరమైతే నష్టపరిహారం కూడా ఇస్తామని తెలిపారు. నగరంలో నాలాలు అభివృద్ధి చేయడం వల్ల పలు ఇబ్బందులు తప్పాయని వెల్లడిరచారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని వెల్లడిరచారు.













