డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణకు చెడ్డపేరు- మంత్రి శ్రీనివాస గౌడ్
హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే రాష్టానికి అనేక పెట్టుబడులు వస్తాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం దేశంలోనే నెంబర్ వన్‌గా రాష్టాన్ని నిలబెట్టడం. కానీ, కొందరు డబ్బుకు కక్కుర్తి పడి చేసే పనుల వల్ల చెడ్డ పేరు రాష్ట్రానికి వస్తోందని, డ్రగ్స్ వ్యవహారంతో తెలంగాణ పేరు బద్నాం అవుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అయితే రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారని, ఇకపై పరిస్థితి మరోలా ఉంటుందని మంత్రి హెచ్చరికలు జారీ చేశారు.













