లాస్ఏంజెల్స్ లోనూ శ్యామల సత్తా చాటాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
అంతర్జాతీయ వెటరన్ స్మిమింగ్ క్రీడాకారిణి గోలి శ్యామలను తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి శ్యామలను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన శ్యామల అంతర్జాతీయ స్థాయి వేదికలపై వెటరన్ స్మిమ్మింగ్ విభాగంలో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో ఐలాండ్ నుంచి లాస్ఏంజెల్స్ వరకు 36 కిలోమీటర్ల ఈత పోటీల్లో సతా చాటాలని ఆకాంక్షించారు. భారత్-శ్రీలంక మద్య ఉన్న హిందూ సముద్రంలో ఉన్న పాక్ జల సంధిని ఈదిన రెండో మహిళగా చరిత్ర సృష్టించారని అన్నారు. అదే స్ఫూర్తితో ప్రపంచంలోని సప్త సముద్రాలను ఆది తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలనే లక్ష్యంతో ఎంతో ప్రమాదకరమైన. అత్యంత కోల్డ్ వాటర్ కలిగిన లోతైన ప్రాంతమైన కేటాలిన ఐలాండ్ నుంచి లాస్ ఏంజిల్స్ వరకు జరిగే స్మిమ్మింగ్ అడ్వైంచర్స్ ఈవెంట్లో పాల్గొనేందుకు వెళుతున్నందుకు శ్యామలను మంత్రి అభినందించి సన్మానించారు.













