దేశంలో ఎవరూ తీసుకోని గొప్ప నిర్ణయాలు.. సీఎం కేసీఆర్

కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎవరూ తీసుకోని గొప్ప నిర్ణయాలు తీసుకోవడం సత్ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట్ర గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రెండో దశ కొవిడ్ వ్యాక్సిన్ మంత్రి సత్యవతి రాథోడ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ స్ప్రెడర్స్కు మొదటగా వ్యాక్సిన్ ఇవ్వాలనడం ఇందులో భాగమేనని, ఇందుకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించి లాక్ డౌన్ విధించడం వల్ల లాక్ డౌన్ కు ముందు 33, 34 శాతంగా ఉన్న కోవిడ్ నేడు 8,9 శాతానికి తగ్గిందన్నారు.
కొవిడ్‍ను కట్టడి చేసేందుకు లాక్‍డౌన్ విధించడంతో పాటు కొవిడ్ బారిన పడ్డ వారికి ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందించేందుకు తీసుకున్న చర్యల వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనకనుగుణంగా కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. రైతుకు ఇబ్బంది ఉండకూడదని సీఎం దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, ఈ కొనుగోలుకు అనుకున్న సమయంలో పూర్తి చేయాలన్నారు.