యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామికి.. కిలో బంగారం విరాళం
యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంత్రి తన జన్మదినం పురస్కరించుకొని స్వయంభు నారసింహుని దర్శించుకొని బంగారు తాపడం కోసం కిలో బంగారాన్ని విరాళంగా అందజేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. స్వామి వారి ఆలయంలోకి వెళ్లిన మంత్రి స్వయంభూ నరసింహుడిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో ఎస్.గీత స్వామి వారి వారి ప్రసాదాన్ని అందజేశారు.













