బ్లాక్ చైన్ టెక్నాలజీతో మోసాలకు చెక్

బ్లాక్‌చైన్ టెక్నాలజీతో మోసాలకు చెక్ పెట్టవచ్చునని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన అంతర్జాతీయ బ్లాక్ చైన్ కాంగ్రెస్ ఐటీ నిపుణుల సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాభివృద్ధిలో ఇదో కొత్త అధ్యాయమని, మునుముందు విప్లవ మార్పులు వస్తాయన్నారు. పలు శాఖలను ఈ కొత్త టెక్నాలజీ సమన్వయం చేస్తుందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో విశ్వసనీయత, కచ్ఛితత్వం పెరుగుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. భూరికార్డులు, ఓటింగ్ రికార్డులు, ఆరోగ్యపరమైన రికార్డులు అన్నీ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా సురక్షితం చేయవచ్చునని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా కొన్ని పైలట్ ప్రాజెక్టులను చేపడుతుందని తెలిపారు. 10వ తరగతి సర్టిఫికెట్లను భద్ర పరిచేందుకు ఈ టెక్నాలజీని వాడుతున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల టెన్త్ డేటాను బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా స్టోర్ చేస్తారని, విద్యార్థులను డేటాను ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు అని సృష్టం చేశారు.











































































