దేశానికి ఆ రెండు పార్టీలతోనే నష్టం… అందుకే దూరంగా ఉన్నాం
బీహార్ రాజధాని పాట్నాలో పలు విపక్ష పార్టీ నేతలు సమావేశం అయిన విషయం తెలిసిందే. ఆ అంశంపై తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ దేశానికి తీరని నష్టం చేశాయని, అందుకే ఆ పార్టీలకు దూరంగా ఉన్నామన్నారు. రాజకీయ పార్టీలు ఒక్కటి కావడం ముఖ్యం కాదు అని, దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలంతా ఏకం కావడం ముఖ్యమని కేటీఆర్ అన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమని విమర్శించారు. ఆ రెండు పార్టీల వల్లే దేశంలో సమస్యలు ఉత్పన్నమైనట్లు తెలిపారు. ఒకవేళ విపక్ష పార్టీలన్నీ రాజకీయంగా బీజేపీ వైపో లేక కాంగ్రెస్ వైపో మళ్లితే అప్పుడు దేశానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగానే జాతీయ రాజకీయాలు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఢల్లీి ప్రభుత్వ అధికారులపై కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తాము ఓటు వేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తే పోరాటం తప్పదని తెలిపారు.













