పురపాలక శాఖ దశాబ్ది నివేదికను విడుదల చేసిన మంత్రి కేటీఆర్
పురపాలక శాఖ దశాబ్ది నివేదికను మంత్రి కేటీఆర్ నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి పదో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈసారి పురపాలక శాఖ దశాబ్ది నివేదికను విడుదల చేశామని తెలిపారు. ఇది చాలా సమగ్రమైన నివేదిక అని పేర్కొన్నారు. పారదర్శకత, జవాబుదారితనం లక్ష్యంగా దశాబ్ది నివేదిక ఉందన్నారు. 2014 నుంచి పట్టణాల అభివృద్ధిపై ప్రతి ఏటా జూన్లో వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ దశాబ్ది నివేదికలో 2014 నుంచి సాధించిన ప్రగతిని పొందుపరిచామన్నారు.













