వాటి గురించి ఆలోచించడం మానేసి.. అనవసర విషయాలపై
మతాల పేరుతో కొట్లాడుకోవాలని ఏ దేవుడు చెప్పాడని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నీళ్లు లేవని కొందరు, తిండి కోసం ఎంతో మంది అల్లాడుతున్నారని, అలాంటి వాటి గురించి ఆలోచించడం మానేసి అనవసర విషయాలపై ఎందుకు దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు. 8 ఏళ్ల పాలనలో ఏం సాధించారని విమర్శలు చేస్తున్న విపక్ష నేతలు వాస్తవాలు తెసుకోవాలని పేర్కొన్నారు. జలసంరక్షణలో తెలంగాణ దేశానికే ఓ నమూనాగా మారిందన్నారు. సిరిసిల్ల జిల్లా ఐఏఎస్‌లకే జలసంరక్షణ పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిందన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించిందన్నారు.
రాష్ట్రంలో జరిగినన్ని నియామకాలు ఎక్కడా జరగలేదు. ఎన్నో ప్రతిబంధకాలు అధిగమించి నియామకాలు చేపడుతున్నాం. 8 ఏళ్లలో 2.22 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. ప్రభుత్వం రంగంలో అందరికి ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. అందుకే ప్రైవేటు రంగ సంస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. 8 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఒక్క విద్యా సంస్థను కేటాయించలేదు. రాష్ట్రానికి వచ్చి కొందరు మాపై విమర్శలు చేస్తుంటారు. ముందు వాళ్లు ఏమేమి ఇచ్చారో తెలుసుకుంటే బాగుంటుందని అన్నారు.













