ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి .. దానికోసం తన వంతు కృషి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, దానికోసం తన వంతు కృషి చేస్తానని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని పార్లమెంట్లో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. విభజన వేళ ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం బాధాకరం. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అని ఆయన అన్నారు.













