ఎన్నారైలతో మంత్రి హరీశ్ వీడియో కాన్ఫరెన్స్
టీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని పార్టీకి చెందిన ఎన్నారైలు తిప్పికొట్టాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో ఎన్నారైల పాత్ర ఎంతో గొప్పదని, దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఎన్నారైలు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సిద్దిపేటలోని తన నివాసం నుంచి టీఆర్ఎస్ ఎన్నారైలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రామలింగన్న ఆకస్మాత్తుగా మరణించడం చాలా లోటు అని, ఒక ఉద్యమకారునిగా పనిచేసిన ఆయన కుటుంబానికి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చినట్లు చెప్పారు. సోలిపేట సుజాత అందరికీ సుపరిచితురాలేనని, ఆమె ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. సుజాతక్కను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామని ఆయన అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, యూకే, న్యూజిలాండ్ తదితర 30 దేశాల నుంచి నేతలు పాల్గొన్నారు.













