జేఎన్టీయూ-సీఎంయూ ఎంబీఏ నోటిఫికేషన్
అమెరికాలోని సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీ (సీఎంయూ), జేఎన్టీయూ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎంబీఏ కోర్సు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నాలుగేళ్ల బీటెక్, బీడీఎఎస్ వంటి యూజీ కోర్సులు లేదా మూడేళ్ల డిగ్రీ కోర్సుతో పాటు ఏడాది పీజీ డిప్లమో కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులని జేఎన్టీయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ తారాకళ్యాణి తెలిపారు. ఈ కోర్సులో మొదటి ఏడాది జేఎన్టీయూలో, రెండో ఏడాది సీఎంయూలో తరగతులు ఉంటాయని అమె వివరించారు. ఆసిక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.













