టీఎస్పీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్గా నియమితులైన మాజీ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అలాగే నూతనంగా నియమితులైన సభ్యులు అనితా రాజేంద్ర, ప్రొఫెసర్ ఎన్.యాదయ్య, పాల్వాయి రజనీ కుమారి కూడా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.













